అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి
కరీంనగర్ (జనతా న్యూస్ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల సందర్భంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లో ప్రచారం కోసం చేసే ఖర్చులను ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నాటి నుండి నోటిఫికేషన్ విడుదల చేసే వరకు పార్టీలపై, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ వేసేనాటి నుండి అభ్యర్థుల ఖాతాలో ఖర్చులను లెక్కించడం జరుగుతుందని అన్నారు.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల్లో ఉపయోగించే వాహనాలు, వస్తువులు, ఆహార పదార్థాలకు ఇతర ఇతర ఖర్చులను లెక్కించడం జరుగుతుంది అని అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల సంఘం సూచించిన ధరలను పరిశీలించి స్థానిక డిమాండ్ ను బట్టి ఆయా వస్తువులకు ఉండాల్సిన ధరల విషయంలో సూచనలు, సలహాలు అందించాల్సిందిగా తెలిపారు.
ఈ సమావేశంలో పొలిటికల్ పార్టీల ప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధి జే. మోహన్లాల్, బిజెపి పార్టీ ప్రతినిధి బోగి శ్రీనివాస్ , ఎంఐఎం పార్టీ ప్రతినిధి ఎండి మునీర్, వైఎస్ఆర్సిపి ప్రతినిధి టి. జగదీశ్వర్ గుప్తా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రతినిధి జి.మధు, జిల్లా రెవెన్యూ అధికారి నాగరాజమ్మ, అసిస్టెంట్ రిజిస్టార్ అమృత్ సేన రెడ్డి, ఆర్టీవో జనార్దన్ రెడ్డి, డీఎస్ఓ తనూజ తదితరులు పాల్గొన్నారు.