laugphing Day: నేటి ఆధునికయ యాంత్రిక వేగవంతమైన జీవన విధానంలో సంతృప్తిగా నవ్వగలిగే సందర్భాలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. మనస్పూర్తిగా నవ్వడంతో పలు శారీరక, మానసిక అస్వస్థల నుంచి ఉపశమనం సిద్ధిస్తుందని పలువురు వైద్యులు తెలుపుతున్నారు. ఈనేపథ్యంలో ప్రత్యేకంగా నవ్వుల క్లబ్బులను నెలకొల్పి లాఫింగ్ యోగ సాధన, లాఫ్టర్ థెరపీ చేయిస్తున్నారు. మనస్ఫూర్తిగా నవ్వడం, మనస్ఫూర్తిగా నవ్వగలగడం ఓ మంచి అమూల్యవరం. ఆరోగ్యానికి నవ్వులు ఉచిత ఔషధాలుగా పని చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా నవ్వుల ప్రాధాన్యతను గుర్తించి ప్రతి యేటా మే మాసపు తొలి ఆదివారం రోజున ప్రపంచ నవ్వుల దినం నిర్వహిస్తున్నారు. 10 జనవరి 1998 రోజున ముంబై పట్టణంలో డాక్టర్ మాధవ్ డాక్టర్ మాధవ్ కటారియా చొరవతో నవ్వుల యోగ ఉద్యమం ప్రారంభించారు.
దైనందిన జీవితంలో నవ్వుడానికి కారణాలను వేతకాలే కానీ.. బాధలను వెతికి వెతికి మోయడం సరికాదు. ప్రతికూల సమస్యలను సాధన సమయంలో నవ్వుల ను ఆశ్రయించడం ఉత్తమంగా పాటించాలి. మానసిక క్రోధాన్ని మాయం చేయగల మహాత్తర శక్తి నవ్వులకు మాత్రమే ఉంటుంది. పట్టణంలోని పార్కులలో ప్రతిరోజు ఉదయం వ్యాయామం సమయంలో లాఫింగ్ క్లబ్బుల ద్వారా జోక్స్ చెప్పుకుంటూ మనసారా నవ్వుకుంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఐదు ఖండాల్లో 6 వేలకు 6000 లకు పైగా లాఫింగ్ క్లబ్బులు విస్తరించబడి ఉన్నాయి. నవ్వడం వల్ల అనేక అనారోగ్యాలు మాయమవుతున్నాయని ప్రపంచంతో లాప్టాప్ తెరఫీ కూడా బహుళ ప్రచారం పొందింది. వరల్డ్ లాఫ్టర్ డే సందర్భంగా నవ్వుల ప్రాధాన్యతలను తెలిపే ప్రసంగాలు జోక్స్ చెప్పిన నవ్వించడం.. శాంతి ర్యాలీలో రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు పలు ఆసక్తికర హాస్య కార్యక్రమాల నిర్వహిస్తారు. నవ్వు ఓ అద్భుత ఉచిత దిన దివ్య ఔషధం. నవ్వుల సుగుణాలతో మానవ సంబంధాలు ప్రపంచశాంతి సోదర భావం స్నేహబంధాలు లాంటి ప్రయోజనాలు ఉన్నాయి. దినచర్యలో సాదా నవ్వగలిగిన వారు చాలా అదృష్టవంతులుగా, ఆరోగ్యవంతులుగా అందరిని దృష్టిని ఆకర్షిస్తారు. నవ్వడం, నవ్వులను పంచడమే జీవిత పరమార్థంగా బతకడం అలవర్చుకోవాలి. నవ్వడంతో శరీరక వ్యాయామం జరిగే జీవ వ్యవస్థ సర్దుకుంటుంది.
నవ్వడం వల్ల రక్తం ప్రసరణ సక్రమంగా జరిగి గుండెలకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. నవ్వడం వల్ల కండరాల వ్యాయామం కలుగుతుంది. శరీరంలోనే ట్రైన్ హార్మోన్ మోతారు తగ్గుతుంది. అధిక రక్తపోటును తగ్గించడానికి నవ్వడం అనే ఔషధాన్ని వాడాలి. నవ్వడం వల్ల హెండార్స్ ఇన్ ఉత్తేజితం కావడంతో నొప్పుల నుంచి తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది . ప్రతిరోజు 10 15 నిమిషాలు నవ్వడంతో దాదాపు 40 కాలరీలో ఖర్చవుతుంది. కోపం ఉద్రేక ఆందోళన ఒళ్ళు నొప్పులు తగ్గుతూ జీవితకాలం పెరుగుతుంది. జ్ఞాపకశక్తి సృజన శ్రీలత మానవ సంబంధాల ప్రాణవాయువు సరఫరాలను పటిష్ట పరిచే సహజ వ్యాయమంగా నవ్వులు ఉపయోగపడతాయి.
క్యాన్సర్ థెరపీకి లాఫింగ్ సహకరిస్తుంది. మా మానసిక ధ్రుఢత్వానికి నవ్వులతో స్నేహం చేయడం ఉత్తమం. మనం నవ్వితే మన చుట్టూ ఉన్న సమాజం కూడా నవ్వుతుంది. నవ్వడంతో మన శరీరంలో వాంఛనీయ మార్పులు జరగడమే కాకుండా, మన తోటి ప్రపంచంలో సానుకూల మార్పులు వస్తాయి. నవ్వుకో సమాధానం నవ్వే అని గుర్తుంచుకోవాలి.