- బెజ్జంకి మండలంలో ఇసుకసూరుల ఇష్టారాజ్యం
- మామూళ్ల మత్తులో అధికారులు?
బెజ్జంకి,జనత న్యూస్:జన సంచారం లేని సమయంలో ఇసుకసూరులు శుక్రవారం అర్థరాత్రి ఇసుక దందా జోరుగా సాగిస్తున్నారు.అడ్డు అదుపులేకుండా సాగిస్తున్న ఇసుకసూరులకు ఎవరి అండదండలున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్రమాలకు,దోపిడికి అడ్డుకట్ట పడుతుందని బావిస్తున్న ప్రజలకు నిరాశే మిగులుతుంది. అధికారులు చట్టపరమైన చర్యలు చేపట్టి అక్రమ ఇసుక రవాణను నియంత్రిస్తారనే ఆశలు అడియాశలవుతున్నాయి.అధికారులు అక్రమ ఇసుక సాగుతున్న అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.అక్రమ ఇసుక రవాణను అరికట్టడం అధికారులు ‘మాముళ్లు’గా తీసుకుంటున్నారనే పలువురు వాపోతున్నారు.ఇప్పటికైనా సంబంధిత నిజాయితీతో అధికారులు అక్రమ ఇసుక రవాణను అరికట్టాలని ప్రజలు కొరుతున్నారు.
డయల్ 100 స్పందన కరువు..
అసాంఘిక కార్యకలాపాలకు,అక్రమాలపై పోలీసులకు సమాచారం అందించడానికి ప్రభుత్వం డయల్ 100 ప్రజలకు వినియోగంలోకి తీసకువచ్చింది.అక్రమ ఇసుక రవాణపై గాగీల్లపూర్ గ్రామంలోన ప్రజలు డయల్ 100 కు సమాచారమివ్వడానికి యత్నిస్తే అధికారులు స్పందన కరువైందని..గోప్యంగా ఉంచాల్సిన పిర్యాదుదారల వివరాలను అధికారులు బహిర్గతం చేస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు.