శ్రీ దుర్గా మాత అమ్మవారు శ్రీ లలితా దేవి ( కుష్మాండ)గా భక్తులకు దర్శనమిచ్చారు. కరీంనగర్ చైతన్యపురి కాలనీ మహాశక్తి ఆలయంలో దేవీ నవరాత్రోత్సవాలు అత్యంత వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. రోజుకో రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం లలితా దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. గాజుల అలంకరణలో దర్శనమివ్వగా..భక్తులు తన్మయత్వం పొందారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భవనీ మాలలో అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భవానీ స్వాములు భారీ సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సాయంత్రం లలిత సహస్రా నామం, సౌందర్య లహరి, కనక ధార స్త్రోత్ర పారాయణం చేస్తారు భక్తులు.