నిన్నటి వరకు హైడ్రా, బుల్డోజర్లపై ఆరోపనలు ప్రత్యారోపనలు వేడెక్కిన రాజకీయం..నేడు వ్యక్తిగత ఆరోపనలతో రచ్చకెక్కింది. సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంపై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మీడియాతో భావోద్వేగంతో కంట తడి పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆమెపై పలు వ్యాఖ్యలు చేశారు. అమెపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులతో తమకు సంబందం లేదని, కొండా సురేఖ ఏడిస్తే తమకు సంబంధం లేదన్నారు. గతంలో మాట్లాడిన బూతులు గుర్తుకు తెచ్చుకోవాలని హితవు చెబుతూ..కొండ సురేఖ, సీతక్క, సీఎం రేవంత్ రెడ్డి నోర్లను పినాయిల్‌తో కడగాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.
ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మంత్రి కొండా సురేఖ కేటీఆర్‌ను ఉద్దేశంచి తీవ్ర ఆరోపనలు చేశారు. హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని, కేటీఆర్ డ్రగ్స్‌కు అలవాటు పడ్డారన్నారు. నాగచైతన్య, సమంత విడి పోవడానికి కూడా కేటీఆరే కారణమని సంఛలన ఆరోపనలు చేశారు కొండ సురేఖ. తనపై బీఆర్‌ఎస్ వారు ట్రోలింగ్ చేస్తుంటే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించే బాధ్యత లేదా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌లో ఐదేళ్లు పని చేశానని, తన గురించి ప్రతీ ఒక్కరికీ తెలుసని చెప్పుకొచ్చారు.
కేటీఆర్ వర్సెస్ కొండా సురేఖ

- Advertisment -