బిల్లులు పెండిరగ్ పెట్టి నేతలపై రాజకీయమా ?
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఫైర్
సిరిసిల్ల -జనత న్యూస్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన అవక తవకలు త్వరలో బహిర్గతం చేస్తామని హెచ్చరించారు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నేతన్నలకు రూ. 197 కోట్ల బకాయిలు పెట్టింది చాలక మొసలి కన్నీరు కార్చుతున్నావా అని కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరలను సూరత్ నుండి తెప్పించి కోట్లు దండుకున్నారని ఆరోపించారు. గత కేసీఆర్ సర్కారు ఏడు లక్షల కోట్ల అప్పులు చేస్తే, తాము ప్రజా పాలన అందిస్తున్నామని తెలిపారు. గత పార్లమెంటు ఎన్నికల్లో బుద్ది చెప్పారని, అయినా తీరు మార్చుకోలేదని ఫైర్ అయ్యారు. సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించేందుకు కోటి 30 లక్షల చీరల చీరల ఆర్డర్ ఇవ్వనున్నారని, ఉత్పత్తి చేసిన ఆ చీరలను మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేస్తే జీర్ణించుకోలేక హేళన చేసింది నువ్వు కాదా అని కేటీఆర్‌ను నిలదీశారు. గత బిఆర్‌ఎస్ పాలనలో స్కీమ్‌ల అన్నీ స్కాం లే నని..తమ ప్రభుత్వం నీటి వనరులు, సంపదను కాపాడే ప్రయత్నం చేస్తుందన్నారు. సిరిసిల్ల జిల్లాల్లో జరిగిన అవకతవకలను త్వరలోనే బయటకు తీస్తామని, వాటికి సమాదానం చెప్పాల్సి వస్తుందన్నారు. గత ప్రభుత్వంలో పని చేసిన అధికారులే ఇప్పుడు పని చేస్తున్నారని, తాము కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడడం లేదని స్పష్టం చేశారు ఆది శ్రీనివాస్.
కేటీఆర్ అక్రమాలు త్వరలో బహిర్గతం చేస్తాం

- Advertisment -