మల్యాల-జనత న్యూస్
జగిత్యాల జిల్లా మల్యాల మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజనేయ స్వామిని దర్శించుకుంది మహిళా అఘోర. కొత్త కారులో నుండి దిగిన అఘోర..ఆలయం లోనికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుంది. లోక కళ్యాణం కోసమే ఆలయాల సందర్శన చేస్తున్నట్లు వెల్లడిరచిన ఆమె.. త్వరలోనే కొండగట్టు శివారులో ఆశ్రమం ఏర్పాటు చేసి ప్రకృతి సేవ చేస్తానని చెప్పారు. మానవ సేవ కంటే ప్రకృతి సేవ చాలా గొప్పదని ఈ సందర్భంగా తెలిపారు. అంతుకు ముందు వచ్చే మార్గమధ్యంలో వైకుంఠధామంలో పూజలు చేసినట్లు తెలిపారు. ఆలయాల సందర్శన కోసం హరిద్వార్ నుండి వచ్చానని, తెలంగాణలోని ఆలయాలన్నింటిని సందర్శిస్తానని తెలిపారు. కొండగట్టు ఆలయంలో దిగంబర రూపంలో ఉన్న అఘోర.. స్వామి వారిని దర్శించుకోవడం సర్వాత్రా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణా లోని ఇతర దేవాలయాలను దర్శించుకుంటానని చెప్పడం, సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న అఘోర

- Advertisment -