ఎట్టకేలకు రాష్ట్ర మంత్రి కొండ సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. సినీ నటులు నాగార్జున, సమంత, నాగ చైతన్య లను వివాదంలోకి లాగుతూ కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ నుండి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నాగార్జున, సమంత, నాగ చైతన్యలు సైతం ఎక్స్ వేదికగ్గా స్పందించి కొండ సురేఖపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయని వ్యాఖ్యానించారు. దీంతో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సైతం మంత్రి కొండ సురేఖను మందలించినట్లు తెలిసింది. దీంతో నిన్న ఎక్స్ వేదికగా తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు కొండ సురేఖ. తన వ్యాఖ్యలపై వారికి బాధ కలిగించి ఉంటే బే షరతుగా ఉప సంహరించుకుంటున్నట్లు వ్యాఖ్యానించారామె. దీంతో సినీ పరిశ్రమ వివాదం సద్దుమణిగినట్లే నని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కాగా..కేటీఆర్‌పై మాత్రం వెనక్కి తగ్గేదే లే..అంటున్నారు మంత్రి కొండ సురేఖ. పరువు నష్ట దావాపై న్యాయ పరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.
కొండ సురేఖ వ్యాఖ్యలు వెనక్కి..వివాదం సద్దుమణిగినట్లేనా..?

- Advertisment -