Komatireddy Rajagopal Reddy: తెలంగాణ బీజేపీకి షాక్ తగిలింది.మునుగోడు నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తిరిగి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పలు విషయాలను వెల్లడించారు. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలని కోరుకుంటున్నానని, అందుకు కాంగ్రెస్ పార్టీయే సరైనదని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని, ఇందుకు ప్రత్యామ్నాయంగా బీజేపీ కంటే ప్రజలు కాంగ్రెస్ నే కోరుకుంటున్నారని అన్నారు. ఏడాది కిందట తెలంగాణలో బీజేపీ రెండో పార్టీగా ఉండగా ఆ పార్టీలో చేరానని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నందున ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
Komatireddy Rajagopal Reddy: బీజేపీకి రాజగోపాల్ రెడ్డి రాజీనామా
- Advertisment -