IPL 2024: ఐపీఎల్ లో మ్యాచ్ లో పాల్గొనేందుకు వెళ్తున్న కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లు ప్రయాణిస్తున్న విమానం రెండుసార్లు దారి మళ్ళింది. వాతావరణం ప్రతికూలంగా ఉండడమే ఇందుకు కారణం అయింది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్న ప్రకారం.. మే 11న ముంబై ఇండియన్స్ తో కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగే మ్యాచ్ కోసం కోల్ కతా నైట్ రైడర్స్ సోమవారం సాయంత్రం లక్నో నుంచి చాప్టర్స్ విమానంలో బయలుదేరింది. విమానం 7.25 గంటలకు ల్యాండ్ అవ్వాల్సి ఉండగా కోల్ కతాలో కుండపోత వర్షాలు కురుస్తుండడంతో విమానాన్ని గుహావాటికి దారి మళ్లించారు. ఆ తరువాత కోల్ కతాకు బయలు దేరింది. కానీ మరోసారి వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని వారణాసికి మళ్లించారు. సోమవారం రాత్రి కోల్ కతా ఆటగాళ్లు వారణాసిలోని హోటల్లో బస చేశారు. మంగళవారం వీరు కోల్ కతాకు బయలుదేరనున్నారు.
కోల్ కతా నైట్ రైడర్స్: రెండుసార్లు దారి మళ్లిన విమానం..
- Advertisment -