హైదరాబాద్, జనతా న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు, హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణి రెడ్డితో కలిసి వెళ్లారు. కాంగ్రెస్ లో చేరుతారని గురువారం కేకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మర్యాదపూర్వకంగా సీఎంతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపా దాస్ మున్షీ, తదితరులు పాల్గొన్నారు. లోక్ సభ ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలపై వారు స్పందించి చర్చించినట్లు సమాచారం. త్వరలో తన కుమార్తె, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి కేకే కాంగ్రెస్ లో చేరనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డితో కేకే భేటీ
- Advertisment -
