Kishan Reddy:వరంగల్, జనత న్యూస్: మేడారం జాతరకు జాతీయ గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నిస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఫిబ్రవరి 22న గురువారం మేడారం జాతరకు వచ్చిన ఆయన అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జాతీయ పండుగ అనే విధానం ఎక్కడా లేదని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు లేకుండా పాడిపంటలతో దేశమంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ములుగులో గిరిజన వర్సిటీ తాత్కాలిక క్యాంపస్ ని ఏర్పాటు చేస్తామని, ప్రవేశాలకు అనుమతిస్తామని వెల్లడించారు, ఇందులో ఎక్కువ సీట్లు స్థానిక గిరిజనుల బిడ్డలకి ఇస్తామన్నారు. రూ. 900 కోట్లతో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తున్నామని, వర్సిటీ భవనాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని చెప్పారు.
Kishan Reddy: మేడారం జాతరకు జాతీయ గుర్తింపునకు ప్రయత్నిస్తా: కిషన్ రెడ్డి
- Advertisment -
