Thursday, September 19, 2024

కిం కర్తవ్యం ?

సంక్షోభంలో సిరిసిల్ల..
పది రోజులుగా నిలిచిన ఉత్పత్తి
విద్యుత్‌ కనెన్షన్లు తొలగించిన సెస్‌
పవర్‌ సబ్సిడీపై అనిశ్చితి..
ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూపు !

జనత న్యూస్‌-కరీంనగర్‌ ప్రతినిధి

సిరిసిల్ల పవర్‌ లూమ్‌ పరిశ్రమ సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. పెండిరగ్‌ విద్యుత్‌ రాయితీతో పాటు, సెస్‌ అధికారుల తీరు..ఇక్కడి పారిశ్రామికులను కుదేలు చేసింది. సెస్‌ అధికారుల చర్యల వల్ల పవర్‌ లూమ్‌ యజమానులకు రాయితీ వర్తించని దుస్థితి ఏర్పడిరది. దీంతో సిరిసిల్లలోని 80 శాతానికి పైగా పవర్‌ లూమ్‌లు, వాటిపై ఆధార పడ్డ కార్మికులు పస్తులుండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మర మగ్గాల పరిశ్రమకు విద్యుత్‌ రాయితీ సమస్యగా మారింది. గత ప్రభుత్వ హయాంలో తలెత్తిన సమస్యను నాన్చుతూ రావడం వల్ల ఇప్పుడు అది జఠిలమై..పరిశ్రమ మూసివేతకు దారి తీసింది. దీంతో పరిశ్రమ మనుగడ సవాల్‌గా మారింది. సిరిసిల్లలో సుమారు 25వేల పవర్‌ లూమ్‌లున్నాయి. 5 వేలకు పైగా విద్యుత్‌ కనెక్షన్లున్నాయి. ఇందులో మూడు వేలకు పైగా విద్యుత్‌ కనెన్షన్లను 10 హెచ్‌పీకి కంటే ఎక్కువ యూనిట్లుగా సెస్‌ అధికారులు చూపించడం వల్ల..ఆయా యూనిట్లకు 50 శాతం ప్రభుత్వ విద్యుత్‌ రాయితీ రాకుండా పోయింది. దీంతో మూడు వేల యూనిట్లకు సంబంధించిన చిన్న, మధ్య తరహా యజమానులు, కార్మికులు నష్టపోవాల్సి వస్తుంది. దీనికి తోడు 2016 నుండి పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు ( బ్యాక్‌ బిల్లింగ్‌) చెల్లించాలని సెస్‌ అధికారులు నోటీసులు జారీ చేయడంతో..యజమానులకు ఇది తలకు మించిన భారంగా మారింది. సెస్‌ అధికారులు రూ. లక్షల్లో వేసే బిల్లులు చెల్లించాలంటే..పవర్‌ లూమ్‌లు మొత్తం అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని పలువురు యజమానులు ఆవేదన చెందుతున్నారు.
10 హెచ్‌పీ వరకు పవర్‌ లూమ్‌ పరిశ్రమకు 50 శాతం విద్యుత్‌ రాయితీ కల్పిస్తోంది ప్రభుత్వం. గతంలో ఇక్కడి యూనిట్లు అన్నీ..విద్యుత్‌ రాయితీ పరిధిలోకి వచ్చాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక..కొత్తగా విద్యుత్‌ రాయితీ సమస్యను తెరపైకి తీసుకొచ్చింది సెస్‌ పాలక వర్గం. కోర్టు, ఎలక్ట్రిసిటీ రెగ్యులారిటీ కమీషన్‌ నెపాన్ని చూపి..సెస్‌ ఎండీ సిరిసిల్ల పవర్‌ లూమ్‌ యజమానులకు నోటీసులు జారీ చేయడం..సమస్య తీవ్రతకు దారి తీసింది. దీంతో పవర్‌ లూమ్‌ యజమానులు, కార్మికులు చేసేది లేక పది రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు. దీనిసై జిల్లా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ రaూ సెస్‌ అధికారులు, పారిశ్రామికులతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని, అప్పటి వరకు పారిశ్రామికులకు సాకారం అందించాలని సెల్‌ అధికారులకు ఆయన సూచించారు.
కొరవడిన సమన్వయం..
సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే అవకాశాలున్నా..ఇక్కడి సెస్‌ అధికారులు, పాలక వర్గ ప్రతినిధులు ఆ దిశగా కృషి చేయడం లేదనే ఆరోపనలున్నాయి. కోర్టు తీర్పు, ఈఆర్‌సీ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే..ప్రభుత్వం పరిష్కరించే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు నిరసన కొనసాగిస్తున్న జేఏసీ నేతలు సైతం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. సిరిసిల్ల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్‌ సైతం అసెంబ్లీలో ఈ సమస్యను లేవనెత్తే అవకాశాలు సైతం ఉన్నా..స్తబ్దంగా ఉండడం పట్ల కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సెస్‌ కక్షపూరిత చర్యే
వేముల దామోదర్‌, పవర్‌ లూమ్‌ పారిశ్రామికుడు

సిరిసిల్ల కార్మికులకు 23 ఏళ్లుగా విద్యుత్‌ రాయితీ వస్తోంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పోయి, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిందని..ఇప్పుడు కక్ష పూరితంగా సెస్‌ పాలక వర్గం, అధికారులు కలసి ఆడుతున్న నాటకం ఇది. సబ్సిడీ, బ్యాక్‌ బిల్లింగ్‌ తదితర సమస్యలను ఇప్పటి వరకు ఎందుకు ప్రభుత్వానికి నివేదించలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా మాజీ మంత్రి కేటీఆర్‌, సెస్‌ అధికారులు కృషి చేయాలి. ఇప్పటికే పది రోజులుగా కార్మికులు పస్తులుండాల్సి వస్తోంది.

విద్యుత్‌ రాయితీ సమస్యను పరిష్కరిచాలి
మండల సత్యం, పారిశ్రామికుడు, సిరిసిల్ల

సిరిసిల్ల పవర్‌ లూమ్‌ల విద్యుత్‌ రాయితీ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. సెస్‌ అధికారులు, పారిశ్రామికులు, టెక్ట్స్‌టైల్‌ శాఖ అధికారుల సమన్వయంతో సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలున్నాయి. దీనిపై సెస్‌ అధికారులు కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. వారు చేసిన తప్పులను తమను బాధ్యులను చేయడం సరికాదు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page