పర్యాటక శాఖ కార్పొరేషన్ ఎండి ప్రకాశ్ రెడ్డి
ఖమ్మం-జనత న్యూస్
ఖమ్మం ఖిల్లా పైకి వెళ్లేందుకు ఏర్పాటు చేయనున్న రోప్ వే, జాఫర్ బావితో ఖమ్మం ఖిల్లా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని పర్యాటక శాఖ అభివృద్ధి కార్పొరేషన్ ఎండి ప్రకాశ్ రెడ్డి అన్నారు. శనివారం ఖమ్మం ఖిల్లా రోప్ వే ప్రతిపాదన స్థలాన్ని, జాఫర్ బావిని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య లతో కలిసి క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. ఖిల్లా పైకి వెళ్లి సందర్శించే విధంగా రోప్ వే ఏర్పాటుకు అనువుగా ఉండే ప్రాంతంపై చర్చించారు. ఎక్విప్మెంట్, ఖమ్మం ఖిల్లా కు రావడానికి రోడ్డు అనుకూలత, పార్కింగ్, ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇళ్లపై నుండి కాకుండా, ఓపెన్ ప్లేస్ నుండి రోప్ వే ఏర్పాటుకు పరిశీలిస్తున్నామని తెలిపారు. అంతకు ముందు జాఫర్ బావిని, బావి వైపు జరుగుతున్న పనులను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పరిశీలించారు
పర్యాటక ప్రాంతంగా ఖమ్మం ఖిల్లా

- Advertisment -