Thursday, September 19, 2024

కేజ్రీవాల్‌ రాజీనామా యోచన వెనుక ఆంతర్యం..?

ఢిల్లీ:
జైలు నుండి షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలైన ఢల్లీి సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు చేసిన ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండు రోజుల్లో కొత్త సీఎంను ఎన్నుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సంఛనల నిర్ణయం వెనుక ఆంతర్యమెంటనే చర్చ జరుగుతోంది. మరో ఐదు మాసాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ గెలుపే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో ఢల్లీిలో ఏడు పార్లమెంటు స్థానాల్లో ఓటమి చవి చూసిన నేపథ్యంలో..ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ పార్టీని బలోపేతం చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా సీఎం పదవికి రాజీనామా చేసి..ఎన్నికల కార్యచరణలో నిమగ్నమయ్యే అవకాశాలున్నాయి. ఒకవైపు ఇండియా కూటమి మద్దతు కూడగడుతూనే..మరోవైపు ఆప్‌ పార్టీ బలోపేతానికి గట్టి ప్రయత్నాల్లో కేజ్రీవాల్‌ ఉన్నట్లు తెలుస్తుంది. సుప్రిం కోర్టు షరుతుల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో సీఎంగా కంటే..పార్టీ అధినేతగా ప్రజలకు దగ్గరయ్యేలా కార్యచరణలో కేజ్రీవాల్‌ ఉన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page