Kedarnath Temple: ప్రముఖ ఆలయాల్లో ఒకటైన ఆలయం ఉత్తరాఖండ్లోని కేదార్ నాథ్ ఆలయం శుక్రవారం తెరుచుకుంది. మే 10వ తేదీన అక్షయ తృతీయ సందర్భంగా భజనలు. కీర్తనల మధ్య ఆలయ అధికారులు హర హర మహాదేవ అంటూ తలుపులు తెరిచారు. ఈ సందర్భంగా హెలీక్యాప్టర్లతో పూల వర్షం కురిపించారు పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు దేశవ్యాప్తంగా ఇక్కడికి తరలివస్తారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్ప సింగ్ ధామి కూడా ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు సీఎం పుష్కర్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. యాత్రికులు సురక్షితంగా ప్రయాణం చేయాలని సూచించారు.
Kedarnath Temple: తెరుచుకున్న కేదార్ నాథ్ ఆలయం..
- Advertisment -