హైదరాబాద్, జనతా న్యూస్: భూ వివాదం కేసులో కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్టు చేశారు.తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అన్న కుమారుడు అయిన కన్నారావు మన్నెగూడ భూ వివాదం కేసులో ఏ1 గా ఉన్నారు. మంగళవారం ఆయనను పోలీసులు అలుపులోకి తీసుకున్నారు. మన్నెగూడలో భూ వివాదాల్లో తల దూర్చి పలువురిపై దాడి చేసిన ఘటనలో కన్నారావు తో సహా 35 మంది పై ఆదిభట్ల పోలీస్ స్టేషన్లో ఇటీవల కేసు నమోదయింది. మన్నెగూడలో రెండు ఎకరాల కబ్జాకుల యత్నించినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అతడు ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్ ను హైకోర్టు నిన్న తిరస్కరించింది.
భూవివాదం కేసులో కేసీఆర్ బంధువు అరెస్టు
- Advertisment -