తెలంగాణ రాష్ట్రా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు చాలా రోజుల విరామం తరువాత తెలంగాణ భవన్ కు వచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేసీఆర్ కు గాయం అయింది. దీంతో ఆయన కొద్దరి రోజుల పాటు సొంత ఇంట్లో విశ్రాంతి తీసుుకున్నారు. మూడు నెలల విరామం తరువాత కేసీఆర్ మంగళవారం తెలంగాణ భవన్ లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తల కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. ఇటీవల ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొననున్నారు.
