తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సొంత నియోజకవర్గం గజ్వేల్ లో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన హెలీక్యాప్టర్ లో కామారెడ్డికి బయలుదేరారు. అక్కడ మధ్యాహ్నం 2 గంటల లోపు నామినేషన్ దాఖలు చేస్తారు. గజ్వేల్ లో నామినేషన్ సందర్భంగా పార్టీ కార్యకర్తల సందడి నెలకొంది. రిటర్నింగ్ కార్యాలయానికి కారులో వచ్చిన ఆయన అక్కడి నుంచి ప్రచార వాహనంలో నామినేషన్ కేంద్రానికి వెళ్లారు. అక్కడ కొంతమందితో కలిసి నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.
గజ్వేల్ లో కేసీఆర్ నామినేషన్
- Advertisment -