Kcr : నిజామాబాద్, జనతా న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి గురువారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు శుక్రవారం నిజామాబాద్ కు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు నిజామాబాద్ జిల్లాలోని వేల్పూరుకు చేరకుంటారు. అక్కడ 11 గంటలకు వేల్పూర్ లో జరిగే అంత్యక్రియల్లో పాల్గొంటారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ( 77) గురువారం కన్నుమూశారు. ఏడాది కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆమె హైదరాబాద్ లోనే ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదివిశ్వాస విడిచారు. గతంలో అమెకు సర్జరీ జరిగింది. ఆ తర్వాత కోలుకుంటున్నప్పటికీ మళ్లీ అనారోగ్యం బారిన పడ్డారు. ఈ క్రమంలో ఆమె గురువారం మృతి చెందారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రితో పాటు పలువులు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Kcr : నేడు నిజామాబాద్ కు సీఎం కేసీఆర్
- Advertisment -
