Kcr: తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారాల్లో భాగంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూలు ఖరారైంది. రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు నియోజక వర్గాల్లో కేసీఆర్ ప్రచారం ఉండేలా ప్రణాళిక వేశారు. ఈనెల 22న నల్గొండ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని మిర్యాలగూడలో ఈ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ప్రతిరోజు ఉదయం పొలంపాట కార్యక్రమం ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలోని స్థానిక నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం అవుతారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నేరాశ్యంలో ఉన్న శ్రేణుల్లో పునరుత్తేజం నింపడంలో ఈ సమావేశాలు ఉపయోగపడతాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సాయంత్రం వేళలో రెండు, మూడు ప్రాంతాల్లో రోడ్ షోలో కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం నాయకుల కార్యకర్త ఇళ్లలోనే ఇతర నాయకులు బసచేస్తారు. మే నెల 10న మెదక్ జిల్లా సిద్దిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దాంతో కేసిఆర్ బస్సు యాత్ర ముగుస్తుంది. ఈనెల 22న హైదరాబాద్లో బయలుదేరే కేసీఆర్ బస్సు యాత్ర ముగిసే వరకు తిరిగి హైదరాబాదుకు రారు. ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలో చేపట్టేయాత్రలో హెలీక్యాప్టర్ వాడనున్నారు. మిగిలిన అన్నిచోట్ల బస్సులోనే ప్రయాణం చేస్తారు.
Kcr: కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు..
- Advertisment -