Kcr : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు. ఆయన ఎక్కువగా కాంగ్రెస్ పార్టీపైనే విమర్శలు చేయడం కనిపించింది. తాజాగా ఖమ్మం జిల్లా పాలేరులో నిర్వహించిన ఆశీర్వాద సభలో మాట్లాడుతూ తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తోందన్నారు. కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ పరిస్థితులు మొదటికి వస్తాయన్నారు. ఖమ్మం జిల్లా కు చెందిన తుమ్మల నాగేశ్వర్ రావును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వర్ రావు ఓడిపోతే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేశారు. నేను ఆయనను ఎక్కడా మోసం చేసినట్లు కనిపిస్తంది? అని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే వందకు వంద శాతం రైతు బంధు కొనసాగుతుందని అన్నారు. రేషన్ కార్డుపై సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేసేవారిని మాత్రమే గెలిపించాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
Kcr : కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ పరిస్థితులు మొదటికి : పాలేరులో కేసీఆర్
- Advertisment -