- కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ జువ్వాడి నరసింగ రావు
- పోన్ ట్యాపింగ్ క్షమించరాని నేరం..
- మాజీ ఇంటెలిజెన్స్ ఐజీ రాధాకిషన్ రావు వాగ్మూలంపై స్పందించిన కాంగ్రెస్ నేతలు
- ట్యాపింగ్ వ్యవహరంపై ప్రభుత్వ చర్యలు చేపడుతుందని విశ్వాసం
కరీంనగర్,జనత న్యూస్: పోన్ ట్యాపింగ్ వ్యవహరంలో మాజీ ఇంటెలిజెన్స్ ఐజీ రాధాకిషన్ రావు వాగ్మూలంపై ఫ్రకంపనలు సృష్టించింది. విస్తూపోయే నిజాలు బహిర్గతమవ్వడంతో కాంగ్రెస్ నేతలు జువ్వాడి నరసింగ రావు,ఎమ్మెల్యే కవ్వంపల సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు.సోమవారం కరీంనగర్ డీసీసీ కార్యలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నరసింగ రావు మాట్లాడారు.ఎన్నికల సమయంలో మేము మా పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన సమాచారాన్ని తెలుసుకొని ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలు అడ్డంకులు సృష్టించినారన్నారు.ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో మచ్చ లేని నాయకుడిగా జువ్వాడి రత్నాకర్ రావు నాలుగు దశాబ్దాలు రాజకీయంలో ప్రజలకు సేవలందించారని గుర్తు చేశారు.నాడు కేసీఆర్ కుటుంబానికి కారులో డీజిల్ పోసుకునే పరిస్థితి లేదని..నేడు లక్షల కోట్ల రూపాయలకు ఏ వధంగా ఎదిగారని అగ్రహం వ్యక్తం చేశారు.వాస్తవాలు బయట పెడుతాననే కేసీఆర్ కుటుంబం నా ఫోన్ ను టాపింగ్ చేశారని ఆరోపించారు.20 ఎకరాల ఫామ్ హౌస్ నేడు 100 ఎకరాల ఫామ్ హౌస్ అయ్యిందని నాపై పోటీ చేసిన డా.సంజయ్ కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడని అతను వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.నా పోన్ ట్యాపింగ్ కు బాధ్యులైన హరీశ్ రావు,కేటీఆర్,కేసీఆర్ పై రాష్ట్ర ప్రభుత్వానికి,డీఐజీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో విపరీతంగా డబ్బులు పంచి ఓటర్లను ప్రభావితం చేశారని..భూ దందాలో కోట్ల రూపాయలు తిన్నారన్నారు.కేసీఆర్ కుటుంబాని తెలంగాణ నుండి బహిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.పోన్ ట్యాపింగ్ వ్యవహరంలో బాధ్యులైన వారిపై త్వరితగతిన ప్రభుత్వం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి,కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పురుమల్ల శ్రీనివాస్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్,ఎస్టీ సెల్ అధ్యక్షుడు బాణోతు శ్రావణ్ నాయక్, జిల్లా కాంగ్రెస్ నాయకులు రామిడి రాజీ రెడ్డి, నూనె గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
*ఫోన్ ట్యాపింగ్ లో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు
– డా.కవ్వంపల్లి సత్యనారాయణ..
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు కేసీఆర్ కుటుంబం ప్రయత్నించారని ..మాజీ ఇంటెలిజెన్స్ ఐజీ రాధాకిషన్ రావు వాగ్మూలంపై తన పోన్ ట్యాపింగ్ వ్యవహరంపై మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్పందిస్తూ ఫోన్ ట్యాపింగ్ క్షమించరాని నేరమని బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.కేసీఆర్ కుటుంబ సభ్యులలోని హరీష్ రావు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధా కిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం గత ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్,సంతోష్ రావు ఈ వ్యవహారంలో బాధ్యులైన ప్రతి ఒక్కరికి నోటీసులు అందజేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వానికి విన్నవిస్తానని కవ్వంపల్లి తెలిపారు.బాధ్యులైన దోషులను ప్రజాక్షేత్రం నుండి వెలివేయాలని, గతంలో ఫోన్ టాపింగ్ వల్ల ప్రభుత్వాలు కూలిపోయిన సందర్భాలు ఉన్నాయని ఇప్పుడు రాజకీయ రంగంలో పాటు సినీ ప్రముఖులు, కొంతమంది వ్యాపారవేత్తల ఫోన్లను టాపింగ్ చేసి ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పనిచేసిన వారందరినీ బ్లాక్ మెయిల్, బెదిరింపులతో నియంతృత్వ పాలనను కొనసాగించిన కేసీఆర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ క్షమించరని త్వరలోనే ఆ పార్టీని భూస్థాపితం చేసేందుకు ప్రజలు వేచి చూస్తున్నారని కవ్వంపల్లి తెలిపారు. ఈ వ్యవహారంలో భాగస్వాములైన బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులను, అధికారులను తక్షణమే వారి బాధ్యతల నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.