(మనకొండూర్ నియోజక వర్గ ప్రత్యేక ప్రతినిధి జనత న్యూస్)కార్తీక పౌర్ణమి సందర్భంగా తిమ్మాపూర్ మండలం లోని అలుగునూర్ లో మానకొండూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన ఆరు గ్యారంటీలను పక్కగా అమలు చేస్తామని శివాలయంలో ప్రతిజ్ఞ చేశారు. తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయ ఇన్చార్జి గోపు మల్లారెడ్డి, సీనియర్ నాయకులు గోగోరి నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ చిందంకిష్టయ్య, కాలువ మల్లేశం, గోపు వెంకట్ రెడ్డి, తదితరులు ఉన్నారు.