Karthika Masam :కార్తీక మాసం ప్రారంభం కావడంతో ఆలయాలన్నీ కిటకిట లాడుతున్నాయి. ప్రముఖ క్షేత్రాలన్నీ భక్తులతో నిండిపోయాయి. ముఖ్యంగా నదీ తీర ప్రాంతాల్లో భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో గోదావరి తీరం మంగళవారం భక్తులతో నిండిపోయింది. ఇక్కడికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఇక్కడున్న పుష్కరఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమి ఘాట్ లు కిక్కిరిసిపోయాయి. మహిళలు శివనామస్మరణతో గోదావరిలో కార్తీక దీపాలు వదులుతున్నారు. అలాగే ఏపీలోని పాలకొల్లు క్షీరారామలింగేశ్వరా స్వామి ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేశారు. స్వామి దర్శనానికి బారులు తీరారు.
Karthika Masam : గోదావరి తీరాల్లో ‘కార్తీక’ సందడి..
- Advertisment -