Saturday, March 14, 2026

కరీంనగర్: పోలీసులకు సన్మానం

కరీంనగర్, జనతా న్యూస్: పదవీ విరమణ పొందిన పోలీసులకు పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి సన్మానించారు.  కరీంనగర్ కమిషనరేట్ లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్ గా పనిచేస్తూ, పదవీకాలం ముగిసిన  మొహమ్మద్ నూరుద్దీన్ ,  మొహమ్మద్ బషీరుద్దీన్ , సయ్యద్ మొయినుద్దీన్ ఆర్మ్డ్ ,   పి చంద్రా రెడ్డిలు  శనివారం  పదవి విరమణ పొందారు. ఈ సందర్బంగా కమిషనరేట్  కాన్ఫరెన్స్ హాల్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.  కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి మాట్లాడుతూ ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ అనివార్యమన్నారు. ఎన్నో సవాళ్లతో కూడుకుని వున్న పోలీస్ ఉద్యోగం సంపూర్ణంగా చేసి పదవి విరమణ పొందడమే గొప్ప విజయం అన్నారు. విరమణ పొందుతున్న అధికారులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. అనంతరం పదవి విరమణ పొందుతున్న అధికారులకు కమీషనర్ గారి చేతుల మీదుగా పూలమాలవేసి శాలువాతో సత్కరించారు. వారికి జ్ఞాపికలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఏ లక్ష్మీనారాయణ , అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ముని రామయ్య , రిజర్వు ఇన్స్పెక్టర్లు, శ్రీధర్ రెడ్డి (వెల్ఫేర్), సురేష్ (అడ్మిన్), కరీంనగర్ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్సై మామిడి సురేందర్, ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page