అరే గీ టైమ్ ల నేను ఏంపిగా పోటీ చేస్తున్నాను.. గీ టైమ్ ల నా పార్టీ సభ్యులు, పార్టీ నాయకులు విడిచి పోవచ్చానని బాధ కలిగింది కొంత సేపు.. నేనేం తప్పు పని చేసిన , నేనేం తప్పు పని చేసిన ..పార్టీని వదిలి పెట్టి పోయి గీ ఎన్నికల్లోపట .. నేను ప్రజల కోసం పని చేసేటోన్ని కదా ..కరీంనగర్ నియోజక వర్గ అభివృద్ది కోసం మాట్లడటోన్ని కదా ..
అంటూ ఇన్నాళ్లు బీఅర్ఎస్ పార్టీకి కీలక నేతల్లో ఒకరిగా ఉన్న పెద్దన్న ,కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయిన్ పల్లి వినోద్ కుమార్ కరీంనగర్ లోని ప్రెస్ మీట్ లో వ్యక్తం చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ప్రస్తుత పరిస్థితిని ఓ సినిమాలోని సిరివెన్నెల రాసిన గీతం అద్దం పడుతున్నట్లనిపిస్తుంది.
కరీంనగర్,జనతా న్యూస్: కరీంనగర్లోనే కాదు బీఆర్ఎస్ పార్టీ లోనే వినోద్ సారంటే పెద్దన్న లెక్క,పార్టీలో ఏమన్న తేడాలొస్తే ఏవ్వరైన ఏ స్థాయి లీడర్ అయిన ఆయన దగ్గరకు వచ్చేటోళ్ళే ఎలాంటి సమస్యనైన భుజాన వేసుకొని చక్కదిద్దేటోడు.రాష్ర్టంలో ఎన్నో సార్లు పార్టీలోని అలకలను అలవోకగా పరిష్కరించేవాడు. వినోద్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో క్రీయాశీలక నేత. పార్టీ అధినేత కేసీఆర్ కి సన్నిహితుడు. వాక్చాతుర్యం కలిగిన మేధావి. తెలంగాణలో కరీంనగర్ కి తొలి పార్లమెంట్ సభ్యుడు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఐదేళ్లు ఎంపీగా, రాష్ర్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా పని చేశాడు.నాయకుల మద్య క్యాడర్ మధ్య ఏ సమస్యలున్న ఆయన సలహాలు తీసుకునే వారు , చివరకు పెద్దసార్ సైతం కీలక విషయాలు పార్టీ నిర్ణయాలు ఆయనతోనే చర్చించే వారు ..ఎందుకంటే ఆయన పార్టీలోనే మేధావి కదా..తాజాగా లోకసభ ఎన్నికలు వచ్చేసరికి ఆయన పరిస్థితి అయోమయంగా మారిపోయింది. అధినేత కేసీఆర్ ఆయనపై విశ్వాసం ఉంచి మరీ టికెట్ ఇచ్చినప్పటికీ పార్టీ క్యాడర్ ఒక్కొక్కరుగా జారీ పోతున్న తీరు ఆందోళన కల్గిస్తోంది. సెగ్మెంట్ స్థాయి నుండి క్షేత్ర స్థాయి లీడర్లకు పెద్దన్నలా ఉన్న వినోద్ కుమార్ నేడు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారనే చెప్పాలి.తన ఎన్నికల నాటికి పార్టీ శ్రేణులంతా కలిసి పనిచేస్తారన్న ఆశతో ఇంతకాలం వారిని అక్కున చేర్చుకున్న వినోద్ కుమార్ కు చాలా మంది నాయకులు దూరం అవుతున్న తీరు ఆందోళన కల్గిస్తోంది.పార్టీని వీడుతున్న వారి గురించి అభ్యర్థి వినోద్ కుమార్ ప్రెస్ మీట్లో మాట్లాడిన ఆయన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.పక్కనున్న వారు కూడ సైలెంట్ అవడం, మరికొందు మొఖం చాటెస్తుండటం చూస్తుంటే ,ఒకప్పుడు పార్టీ శ్రేణులకు పెద్దదిక్కుగా వ్యవహరించిన వినోద్ కుమార్ ను ఒంటిరిని చేస్తున్న తీరు మాత్రం చర్చనీయాంశంగా మారింది.
for E Paper Click Here
Daily News E-Paper: Latest News and Insights from Telangana (janathadaily.in)
ఎన్నికల వేళ ఉద్యమ పార్టీకి కీ వరుసగా ఎదురు దెబ్బలు
ఉద్యమానికి ఊపిరి పోసిన పార్టీ అది.. సవాళ్ళకు ప్రతి సవాళ్ళుఆపార్టీకీ కొత్తేం కాదు..ఆంధ్రపాలకుల నిరకుంశం పైన అలుపెరుగని పోరాటం చేసిన పార్టీ అదీ..తెలంగాణ రాష్ర్టం టీఆర్ఎస్ తోనే అని నమ్మిన ప్రజలు పార్టీకి వెన్నంటే నిలిచారు.ప్రత్యక రాష్ర్టం ఏర్పడిన తర్వాత కూడ ఆ పార్టీకి రెండు సార్లు అధికారం కట్టపెట్టారు.అన్ని పార్టీల నాయకులు ఎమ్మేల్యేలనుండి మొదలు కొని వార్డుమెంబర్ దాకా బీఆర్ఎస్ పార్టీ ముందు క్యూ కట్టీ పెద్డసారు ను ప్రసన్నంచేసుకోనేందుకు తహతహలాడేవాళ్ళు .. అదంతా గతం ..కాలం మారింది..ప్రభుత్వం మారింది..బీఆర్ఎస్లో ఎదిగిన నాయకులు ఒక్కొక్కరు పార్టీ ని వీడుతున్నారు. కాంగ్రెస్,బీజేపీలో చేరడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.కాగా బీఆర్ఎస్ కు సెంటిమెంటు జిల్లా అయిన కరీంనగర్ లో ఆ పార్టీ పరిస్థిది దయనీయంగా మారుతోంది,బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులను క్రిమినల్ కేసులు వెంటాడుతున్నాయి. కరీంనగర్ సీపీగా అభిషేక్ మహంతి బాధ్యతలు చేపట్టిన తరువాత భూ అక్రమణలకు ఉక్కు పాదం మోపుతున్నారు. లీడర్ ఎంతటి వాడైన కటకటాలకు పంపిస్తున్నారు.ఇఫ్పటి వరకు కూడా కరీంనగర్ కమిషనరేట్ లో నమోదయిన కేసుల్లో అరెస్ట్ అయిన వారిలో ఎక్కువ శాతం మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం.కేసులనుండి తప్పించుకోవడానికనో లేక మరోమారు అధికారం తమకే ఉండలనో గాని ఇంతకాలం గులాభి జెండా నీడన ఉన్న నాయకులు ఇరత పార్టీల్లోకి వలసపోతున్నారు. ఇప్పటికే పలువురు కార్పోరేటర్లు, నాయకులు అధికార కాంగ్రెస్ పార్టీవైపు అడుగులేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కార్పోరేటర్లు కొంతమంది పార్టీ మారేందుకు సమాయత్తం అయినప్పటికీ వారిని నిలువరించేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ తాజాగా మాత్రం కార్పోరేటర్లు, ఇతర నాయకులు ఇతర పార్టీల్లో చేరేందుకు సమాయత్తం అవుతున్నా కూడా పట్టించుకునే వారే లేకుండా పోయారు. తాము పార్టీని వీడాలన్న యోచనలో ఉన్నామన్న విషయాన్ని స్థానిక నాయకత్వానికి చెప్పినా పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో చాలా మంది కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. తాజాగా శుక్రవారం కరీంనగర్ కు చెందిన 13 మంది కార్పోరేటర్లు, వారి భర్తలు, మాజీ కార్పోరేటర్లు అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.ఇతర నియోజక వర్గాలనుండి మాజి సర్పంచులు, వార్డ మెంబర్లు సైతం పార్టీని వీడుతున్నారు. మరోవారం రోజుల్లో ఎంపీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాగనుండగా వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ,బీజేపీకండువాలు కప్పుకోవడం పార్టీకి తీరని లోటేనని చెప్పవచ్చు.కరీంనగర్ లోనే గాకుండా ఖమ్మం లో కూడా ఈడెప్ పరిస్థితి కొనసాగుతుంది . అక్కడ నుండి పోటీ చేస్తున్న ఒకప్పటి ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వర రావు సైతం ఎదురీదాల్సి వస్తుంది.ఎలాంటి సమయంలోనైనా పార్టీని ముందుకు తీసుకెళ్లే సత్తా ఉన్న కేసీఆర్ ఎలాంటి వ్యూహాన్ని అవలంభిస్తారో చూడలి?