కరీంనగర్, జనతా న్యూస్: కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న నిర్వహించిన వాహన తనిఖీల్లో రాత్రి సమయంలో సరైన ఆధారాలు లేని రూ. 4,36,300తో పాటు 3 లక్షల ూపాయల విలువ చేసే వెండి బహుమతులు మరియు నగదు స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు.పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా, ఎన్నికల కోడ్ వెలువడినందున అక్రమ డబ్బు, మద్యం సరఫరా అరికట్టేందుకు కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోర్టుచౌరస్తా వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో కరీంనగర్ గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామానికి చెందిన కట్ట శ్రీనివాస చారి నుండి సరైన ఆధారాలులేని నగదును. గుంటూరు జిల్లా తెనాలి మండలం, నెలపాడు గ్రామానికి చెందిన నల్లబోతుల గొప్ప రాజు, 4కేజీ సిల్వర్ దాదాపు 3,00, 000 లక్షల రూపాయల విలువ చేసే బహుమతులను పట్టుకుని స్వాధీన పరుచుకున్నామని కరీంనగర్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టుబడిన డబ్బును తదుపరి ప్రక్రియకు సంబంధిత అధికారుల వద్దకు తరలించామని తెలిపారు.
కరీంనగర్: వెండి బహుమతులు, నగదు స్వాధీనం
- Advertisment -