90% వడ్డీ మాఫీని సద్వినియోగం చేసుకున్న సంస్థ.
కరీంనగర్, జనతా న్యూస్:ఆస్తి పన్నుల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 90% వడ్డీ మాఫీ అవకాశాన్ని కరీంనగర్ నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ తెలిపారు. ఆస్తి పన్నుల వసూలు కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లో శుక్రవారం రోజు నగరపాలక సంస్థ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ రెవెన్యూ విభాగం చెందిన అధికారులతో కలిసి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను సంప్రదించారు. గత కొద్ది సంవత్సరాలుగా నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన ఆస్తి పన్ను బకాయి విషయం లొ ఆర్టీసీ అధికారులను కలిసి రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఓటీ ఎస్ స్కీం వివరాలను అధికారులకు క్షుణ్ణంగా వివరించారు. 90 శాతం వడ్డీ మాఫీతో ఆర్టీసీ వర్క్ షాప్ ఆస్తిపంను బకాయిని చెల్లించి స్కీమును సద్వినియోగం చేసుకోవాలని అధికారులను కోరారు.
దీంతో ఆర్టీసీ సంస్థ నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన 86 లక్షల 7 వేల 972 రూపాయల ఆస్తి పన్ను బకాయిని నగదును చెక్కు రూపంలో అధికారులు నగరపాలక సంస్థ కమిషనర్ భువనగిరి శ్రీనివాస్ కు అందజేశారు. ఓ టి ఎస్ స్కీం కింద ఒకేసారి ఆస్తి పన్ను చెల్లించిన ఆర్టీసీ సంస్థ అధికారులకు కమిషనర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 31వ తేదీ వరకు అవకాశం కల్పించిన ఆస్తి పన్నులో 90% వడ్డీ మాఫీ స్కీంను నగరంలోని వివిధ సంస్థలు, నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ శాఖలు మరియు ప్రైవేటు సంస్థలతో పాటు నగర ప్రజలు మీయొక్క ఆస్తి పన్ను బకాయిలను గడువులోగా చెల్లించి నగరపాలక సంస్థకు అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ స్వరూప రాణీ, ఆర్ఓ ఆంజనేయులు, బిల్ కలెక్టర్లు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.