- ప్రధాన కార్యదర్శిగా మహేందర్
కరీంనగర్, జనతా న్యూస్: కరీంనగర్ బార్ అసోసియేషన్ 2024-2025 సంవత్సర కాలానికి గురువారము ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నిక లలో అధ్యక్షులుగా పి వి రాజ్ కుమార్ లింగంపల్లి నాగరాజు 128 పై గెలుపొందగా, ప్రధాన కార్యదర్శిగా మహేందర్ రెడ్డి గెలుపొందారని ఎన్నికల అధికారి కాసుగంటి మాధవరావు ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా రఘువీర్ తిరుకోవెల, కార్యదర్శి గా గుగులోతు బీమా, లైబ్రరీ సెక్రెటరీ గా రాజేందర్ కటకం, లేడీ రిప్రజెంటేటివ్ పదవికి రేణుక డి, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మూడు పదవులకు మాతంగి రవీందర్ ,వెన్న సుంకే దేవ్ కిషన్, కందుల అరుణ్ కుమార్ లు ,జూనియర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ మూడు పదవులకు పాస్తాం ఆంజనేయులు ,బెజ్జంకి శ్రీకాంత్, కొండ్రా లక్ష్మణ్ గెలుపొందారని ఎన్నికల అధికారి ప్రకటించారు. కోశాధికారు గా రామగిరి శ్రీనివాస్, స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రటరీ మడిపల్లి రవి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో న్యాయవాదులు 1034 ఓటు హక్కు ఉండగా, 872 మంది ఈరోజు ఓట్ హక్కును వినియోగించుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ నారదస్ లక్ష్మణరావు, మాజీ సుడా చైర్మన్ రామకృష్ణ , ఎన్నికల అధికారికి సహాయకులుగా పల్లెర్ల గోపాలకృష్ణ, మహేందర్ రావు, గౌతమ్ రాజ్, గడ్డం శ్రీనివాస్ వ్యవహరించారు.
