Sunday, July 6, 2025

చొప్పదండి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన కరీంనగర్ పోలీస్ కమిషనర్

కరీంనగర్, జనతా న్యూస్:కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గల చొప్పదండి పోలీస్ స్టేషన్ ను శుక్రవారంనాడు కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి ఆకస్మిక తనిఖీచేశారు. పోలీస్ స్టేషన్ లోని పలు రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో గల సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల వివరాలు తెలుసుకున్నారు. గతంలో ఎన్నికల సమయంలో గొడవలు చేసిన లేదా అల్లర్లను సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఓటర్లను ప్రభావితం చేసే సంఘ విద్రోహ వ్యక్తులపై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని వారిని సంబంధిత అధికారుల ఎదుట బైండోవర్ చేయడంతో పాటు వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలన్నారు.

అనంతరం చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు, విధుల్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. వాహన తనిఖీల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు, అలసత్వం ప్రదర్శిస్తే శాఖపరమైన చర్యలు తప్పవన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ వాహనాన్ని విడిచిపెట్టకుండా ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. అక్రమ తరలింపులను గుర్తించినట్లయితే సీజ్ చేసే సమయంలో వీడియోగ్రఫీ చేయించాలన్నారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఏసిపి తాండ్ర కరుణాకర్ రావు, చొప్పదండి ఇన్స్పెక్టర్, గోపతి రవీందర్ , చొప్పదండి ఎస్ఐ ఉపేందరచారి, గంగాధర ఎస్.ఐ. అభిలాష్ మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page