కరీంనగర్, జనతా న్యూస్: కరీంనగర్ జిల్లా లోని టౌన్ డివిజన్ ఏసీపీ కార్యాలయం, టూ టౌన్ పోలీస్ స్టేషన్ లను బుధవారంనాడు కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఆకస్మిక తనిఖీ చేసారు. కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో ఎన్నికల సమయంలో అల్లర్లు లేదా గొడవలు జరిగిన పలు సమస్యాత్మాక మరియు సున్నితమైన పోలింగ్ కేంద్రాలను టౌన్ డివిజన్ ఏసీపీ జి.నరేందర్, టూ టౌన్ ఇన్స్పెక్టర్ రాంచందర్ రావు లతో కలిసి స్వయంగా సందర్శించారు. అనంతరం పోలీస్ స్టేషన్ చేరుకొని పలు రికార్డులను పరిశీలించారు.అధికారులు మరియు సిబ్బందికి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నిర్వహించవలసిన విధుల పట్ల తగు సూచనలు చేసారు. నామినేషన్ ప్రక్రియ , సభలు సమావేశాలు నిర్వహించుకొనుటకు ఇచ్చే అనుమతులు మరియు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా తీసుకుంటున్న చర్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రశాంత వాతావరణం లో ఎన్నికలు జరిగేలా పక్కా ప్రణాళికతో ముందుకుసాగాలన్నారు. ఎవరికీ భయపడకుండా నిష్పక్షపాతంగా ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. రౌడీ షీటర్స్ , శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను, ముఖ్యముగా ఎన్నికల వేళ గొడవలు సృష్టించి ప్రజలను లేదా ఓటర్లను భయ భ్రాంతులకు గురిచేసే సంఘ విద్రోహ శక్తులపై పటిష్ట నిఘా ఉంచి వారిని సంబంధిత అధికారుల ఎదుట బైండోవర్ చేయటమేగాక , ఎప్పటికప్పుడు వారి కదలికలను పర్యవేక్షించాలన్నారు. ఎన్నికల నియమావళి క్షేత్ర స్థాయిలో ఎలా అమలు అవుతుందని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ టౌన్ డివిజన్ ఏసీపీ నరేందర్, టూ టౌన్ ఇన్స్పెక్టర్ రాంచందర్ రావు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు .
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్
- Advertisment -