-
Rule Is Rule.. Rule For All.. కరీంనగర్ సీపీ అభిషేక్ అంటే హడల్..
-
మూడు రోజుల్లోనే 17 కేసులు
-
ప్రజా ప్రతినిదుల్లో మొహంతి ఫీవర్..
జిల్లా లోని ఒక మండలం లో అధికార పార్టీ అభ్యర్థి డీజే సౌండ్ లతో పర్మిషన్ లేకుండా ర్యాలీ తీస్తుంటే పట్టనట్లు పక్కనుండే పోలీస్ జీప్ లో వెళ్తున్నఎస్.ఐ కి పోలీస్ బాస్ నుండి ఫోన్ కాల్ .. వాటిని సీజ్ చేయకుండా ఎలా వెళ్తున్నవని? .. ఖంగుతినన్న సదరు ఎస్ ఐ అలవాటే లేని పనికి మౌనం వహించగా వెళ్ళి సీజ్ చేస్తావా నన్ను రమ్మంటావా అని గద్దించడం తో సీజ్ చేయాల్సిన పరిస్తితి “.
ఓ నియోజకర్గంలో అధికార పార్టీకి చెందిన నోటి దూల ఎక్కువగా ఉన్న అభ్యర్థి పెద్ద డీజే సౌండ్ తో హంగామా చేస్తుంటే వెంటనే స్థానిక పోలీస్ లకు ఫోన్ చేసి చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ఆగ్రహించటం తో పోలీస్ అధికారులు ఖంగుతిన్నారు.
నగరం లో మీటింగ్ కోసం పర్మిషన్ తీసుకొని వచ్చిన వారి కోసం చికెన్ బిర్యానీ పెట్టి ప్రలోభలకు గురిచేస్తున్న వారి పై కేసు..
ఇలా మూడు రోజుల్లో 17 కేసులు నమోదవడం గమనార్హం.అందుకె కాబోలు సారు వస్తునాడని తెలియగానే ప్రతి పోలీస్ కు ఒక వాట్సప్ మెసేజ్ ” బాస్ బాగా స్ట్రిక్ట్ బీ కేర్ ఫుల్ “.
(ఎస్ వి రమణ చారి /శివ కుమార్ యాంసాని)
ఒక పోలీస్ స్టేషన్ నుండి వెరో పోలీస్ స్టేషన్ కు బదిలీ కావాలంటే సదరు నియోజక వర్గ ఎమ్మెల్యే ను ప్రసన్నం చేసుకొని ముడుపు కట్టనదే పని జరగదనేది బహిరంగ రహాస్యమే.అలాంటిది ఈ రోజుల్లో ఏ పోలీస్ లు ఏమిచేస్తారు? అధికార పార్టీ నాయకుల కు వంత పాడటం తప్ప అనేదే ప్రజల మనోగతం .
అలాంటిది ఒక జిల్లాకు పోలీస్ ఉన్నతాధికారి మారడంతో సీన్ తలక్రిందులయింది . పోలీస్ అధికారులకు ముచ్చేటమలు పడుతున్నాయి. పోలీస్ ట్రైనింగ్ లో నేర్చుకున్నవి నెమరు వేసుకుంటున్నారు . గల్లీ ,డిల్లీ నాయకుల ఫోన్ కాల్స్ ను లెక్కచేయడం లేదు. రూల్ ఇస్ రూల్ రూల్ ఫర్ అల్ ..కొందరు మాత్రం ఇలాంటి ఆఫీసర్ ఉండాలని కోరుకుంటే , మాముళ్లకు అలవాటు పడ్డ మరి కొందరికి మింగుడు పడటం లేదు .
ప్రస్తుతం జిల్లాలో ఎన్నికల వాతావరణం జోరందుకుంది. అధికార పార్టీ నేతలు తమకున్న హంగులు, ఆర్భాటలతో ఇతర పార్టీల వారిని భయబ్రాంతులకు లోను చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.అలాంటి వాటికి కళ్లెం వేస్తూ సామాన్యులకు రక్షణ కల్పించాలని జనం కోరు కుంటారు.ఇప్పుడు అలాంటి అధికారి జిల్లాకు రావటం తో చట్టాన్ని ఉల్లఘించే వారికి గుండెల్లో దడ మొదలయింది. ఎక్కడ విన్నా, ఏ నోట అయినా సాబ్ అభిషేక్ మహంతిపేరే జిల్లాలో మారు మోగుతోంది.ఇక్కడ ఎస్పీగా పని చేసిన సుబ్బరాయుడిపై వివిధ ఆరోపణలు రావడంతో ఎన్నికల సంఘం ఆయనపై వేటు వేసింది.
ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ లో ట్రాఫిక్ డీసీపీ-1గా ఉన్న 2011 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతిని కరీంనగర్ పోలీస్ కమీషనర్ గా నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. అభిషేక్ మొహంతి వచ్చిందే తడవుగా పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టిస్టున్నారు.వివిధ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగాచెక్ చేస్తున్నారు. ఎవరిపై కేసులు ఉన్నాయో ఎలాంటి చర్యలు చేపట్టారో అనే విషయాలను ఆరా తీసి పకడ్బందీగా అమలు చేస్తున్నారు.పోలీసు అధికారులు,సాధారణ పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో తెలుసుకుంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు.ఎన్నికల ప్రచారంలో నిబంధనలను అతిక్రమించే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారుల కు హుకుం ఇస్తున్నారు.
వారిపై చర్యలు కూడా తీసుకున్నట్లు పోలీస్ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో బాస్ చూస్తున్నాడురా జర జాగ్రత్త అనే గుబులు సర్వత్రా నెలకొంది.
-
ఎవరీ అభిషేక్ మొహంతి…
ఐపీఎస్ అధికారి ఏ.కే. మహంతి(అజిత్ కుమార్ మహంతి)కుమారుడే ఈ అభిషేక్ మహంతి.ఏకే మహంతి 1975 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా,అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ గా,ఉమ్మడి ఏపీ కి డీజీపీ గా కూడా పనిచేశారు.ఏకే మహంతికి స్ట్రిక్ట్ ఆఫీసర్ గా మంచి పేరుంది.2009 ఎన్నికల సమయంలో అప్పటి డీజీపీ ఎస్ఎస్ యాదవ్ పై వివిధ ఆరోపణలు రావడంతో ఆయనను తొలగించి ఏకే మహంతిని డీజీపీగా ఎన్నికల సంఘం నియమించిన విషయం తెలిసిందే. మహంతి కుటుంబానికి ఎన్నికల పోస్టింగ్స్ అంటే సాధారణ అంశమే. అభిషేక్ మహంతి తండ్రి లాగే ఐపీఎస్ హోదాలో వివిధ ముఖ్యమైన అసెంబ్లీ ఎన్నికలలో కీలక బాధ్యతలు నిర్వహించారు.2019అసెంబ్లీ ఎన్నికల సమయంలో తిరుపతి అర్బన్ ఎస్పీగా పనిచేశారు.అప్పుడు వివిధ ఐపీఎస్ లపై ఆరోపణలు తీవ్రంగా వచ్చాయి.ఆ సమయంలో అభిషేక్ మహంతిని కడప ఎస్పీగా ఎన్నికల కమిషన్ నియమించింది. ఫ్యాక్షనిజం తో రగిలిపోతున్న కడపజిల్లా లో ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.చట్టాన్ని అతిక్రమించే వారి తాట తీస్తారనే పేరు తెచ్చుకున్నారు అభిషేక్ మహంతి.
-
అభిషేక్ ను వద్దన్న టీఎస్ పెద్దలు…
గతంలో ఏపీ నుంచి రిలీవ్ అయిన ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతికి తెలంగాణ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు.ఆయనను విధుల్లోకి తీసుకోకుండా నిరాకరించింది.తనది తెలంగాణ అని తెలంగాణ క్యాడర్ కోసం క్యాట్ నుంచి ఆర్డర్స్ కూడా తెచ్చుకున్నారు.ఇక్కడకు వచ్చిన అభిషేక్ మహంతిని తెలంగాణ ప్రభుత్వం చేర్చుకోలేదు.ఈ విషయంలో కొందరు తెలంగాణ పెద్దలే అభిషేక్ మహంతిని వ్యతిరేకించి నట్లు అప్పట్లో వార్తా కధనాలు వచ్చాయి.ఆ తర్వాత క్యాట్ ఆర్దర్లు,హైకోర్టు జోక్యంతో అభిషేక్ మహంతిని జీవో 583 జారీ చేసి విధిలోకి తీసుకున్నారు.
ఏది ఏమైనా మహంతి కుటుంబం అంటే నీతి మంతమైన అధికారులనే పేరుంది.తండ్రి లాగే తానూ పనిచేయాలని అనుకుంటానని తనకు అన్నింటా తన తండ్రే ఆదర్శమని అభిషేక్ మహంతి చెప్పారు.ఎవ్వరికీ భయపడకుండా చట్టం,న్యాయం మాత్రమే రెండుకళ్లుగా పనిచేస్తానని అభిషేక్ అన్నారు.చట్ట ప్రకారం న్యాయమైనది కాకుంటే ఆ పనిని తాను చేయనన్నారు.ఏదన్నా విషయం పై విభిన్న వ్యక్తులతో చర్చించి వాటిని విశ్లేషించి సరైన నిర్ణయం అమలు చేయటమే తన విజయరహస్యమని అభిషేక్ మొహంతి చెప్పారు.
ఐపీఎస్ కన్నా ముందు రైల్వే లో కూడా అభిషేక్ పనిచేశారు.ప్రజలకు మంచి చేయాలంటే పోలీస్ అధికారి ఉద్యోగమే మంచిదన్నారు.పోలీస్ యూనిఫామ్ లొనే ఓ గర్వం ఉందన్నారు.ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు సహకరించటంలోనే ఆనందం కలుగుతుందన్నారు. మా సోదరుడు అవినాష్ మహంతికూడా ఐపీఎస్ అధికారి కావటం నాకు గర్వంగా ఉందన్నారు.2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణలోని వికారాబాద్ ఎస్పీగా అవినాష్ మహంతి పనిచేశారు. ఎన్నికల కే పరితం కాకుండా తర్వాత కూడా ఈ అధికారినే కొనసాగించాలని ప్రజలు కోరుచున్నారు.