కరీంనగర్ ఐటీఐలో ఏఆర్ వీఆర్ ల్యాబ్..
ఎంపీ నిధులతో ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో పరిశోధన కేంద్రాలు
తెలంగాణలో మొదటి ల్యాబ్ ఏర్పాటు
కరీంనగర్-జనత న్యూస్
కరీంనగర్ ఐటీఐ కాలేజీలో తొలిసారిగా అగ్ మెంటెడ్ రియాలిటీ, వీడియో వర్చువల్ రియాలిటీ (ఏఆర్ వీఆర్) ల్యాబ్‌ను ప్రారంభించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. నేషనల్ ఇన్ స్ట్రక్షనల్ మీడియా ఇన్ స్టిట్యూట్ (నిమి) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అసోం, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్ తోపాటు ఏపీలోని వైజాగ్ రాష్ట్రాలోని ఐటీఐ లలో ఏఆర్ వీఆర్ కోర్సులను ప్రవేశ పెట్టారు. తెలంగాణలో పాయిలెట్ ప్రాజెక్టు కింద ప్రారంభించిన ఈ ల్యాబ్‌లో ఎలక్ట్రిషియన్, వైర్ మేన్, వెల్డర్, ఫిట్డర్, మెకానికల్, టర్నర్ ఇలా పలు కోర్సుల్లో శిక్షణ పొందవచ్చు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సేవా పక్వాఖా పక్షోత్సవాల్లో భాగంగా ఈ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ..‘ఇది పైలెట్ ప్రాజెక్టు మాత్రమే నని, ఇతర ఐటిఐ లలో విస్తరించే అవకాశాలున్నాయని తెలిపారు. ఇక్కడ చదువుకున్న ప్రతి విద్యార్ధికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే తన లక్ష్యమన్నారు. ఐటీఐ కాలేజీలో వాష్ రూంకు ఇబ్బంది ఉందని, కిటికీలు దెబ్బతిన్నాయని విద్యార్ధులు సంజయ్ దృష్టికి తీసుకురావడంతో సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కరీంనగర్ ఐటీఐ 1994లో ప్రారంభమైందని, 30 ఏళ్లలో అనేక మార్పులు వచ్చినప్పటికీ వాటిని అందిపుచ్చుకోలేక పోయారన్నారు. ఏఆర్‌వీఆర్ ల్యాబ్‌లో కూడా కొత్త అప్‌డేట్ వర్షన్స్ వస్తుంటాయని, వాటిని మార్చుకునే అవకాశాలున్నట్లు తెలిపారు. ఇవన్నీ కూడా ఐటీఐ కరిక్యులమ్ ప్రకారమే పాఠాలను డిజిటైలేషన్ పద్దతిలో బోధిస్తారని తెలిపారు.