Karimnagar : కరీంనగర్, జనతా న్యూస్: జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా జిల్లా ఎన్నికల అధికారితో మరియు ఇతర శాఖల సమన్వయంతో కలిసి పని చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ ఎల్ . సుబ్బారాయుడు తెలిపారు, తద్వారా జిల్లాలోని ప్రతి పౌరుడు స్వేచ్ఛగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పిస్తామన్నారు. జిల్లా లోని పోలింగ్ కేంద్రాల వివరాలు జిల్లాలో మొత్తం పోలింగ్ స్టేషనులు 1338, సాధారణ పోలింగ్ స్టేషన్లు 1048,సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 290 ఉన్నాయి అని అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు బైండోవర్ చేసిన కేసుల సంఖ్య 36 బైండోవర్ చేయబడిన వ్యక్తులు 128, గతంలో ఎలక్ట్రోరల్ నేరాలకు పాల్పడ్డ వ్యక్తులను మరియు అందులో సహకరించిన వ్యక్తులను బైండోవర్ చేయడమైనదని, రౌడీ షీట్ కలిగిన వారిని కూడా ముందస్తుగా బైండోవర్ చేయడం జరుగుతుందని చెప్పారు.
ఇప్పటివరకు 33 లిక్కర్ కేసుల నమోదు అయ్యాయని రూ. 2,17,335 /-రూపాయలు స్వాధీనపరచుకున్న ట్లు తెలిపారు.అన్ని ప్రభుత్వ శాఖల సమక్షంలో, సమన్వయము తో జిల్లా సరిహద్దుల్లో ఉన్న 5 ప్రాంతాల్లో 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉండేలా ప్రణాళికతో 5 అంతర్ జిల్లా చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయడం జరిగిందని అవి 1. ముగ్దుంపుర్, 2. అర్నకొండ చొప్పదండి మండలం 3. రేణికుంట (కొత్తపల్లి మండలం) 4. పరకాల ఎక్స్ రోడ్, (హుజురాబాద్ మండలం) 5. సిరిసేడు (ఇల్లంతకుంట మండలం) ఈ చెక్ పోస్ట్ ల ద్వారా అక్రమ రవాణా అడ్డుకోవడం జరుగుతుందని అన్నారు.
జిల్లాలో ఏదేని ప్రదేశంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘన లేదా శాంతి భద్రతల చర్యలకు విఘాతం కలిగించే చర్యలను వేగవంతంగా, సమర్థవంతంగా నిరోధించుట కొరకు మరియు అదుపులోకి తీసుకునేందుకు ఒక ఏసీపీతో కూడిన ప్రత్యేక టీంలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు.వీటితోపాటు అదనంగా సాయుధ పటాలం (AR) నుంచి టీం లు, ఈ టీం ల యొక్క సమన్వయము కొరకు ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గం కొరకు ఒక్కొక్కరు చొప్పున ఇంచార్జ్ లను కేటాయించడం జరిగిందని సీపీ తెలిపారు..