కరీంనగర్,జనత న్యూస్: కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సీపీ అభిషేక్ మొహంతి అదివారం స్వయంగా పరిశీలించారు.హుజురాబాద్, తిమ్మాపూర్, సైదాపూర్ మండలం వెన్నంపల్లి జిల్లా పరిషత్ పాఠశాల, చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్ జిల్లా పరిషత్ పాఠశాల, కరీంనగర్ గణేష్ నగర్ లో గల ఓయాసిస్ స్కూల్, త్రీ టౌన్ పరిధిలోని కార్ఖనాగడ్డ లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలతో పాటు పలు ఇతర పోలింగ్ కేంద్రాలను ఆదివారం సాయంత్రం ప్రత్యక్షంగా పరిశీలించారు.విధుల్లో ఉన్న సిబ్బందిని ఎన్నిక ప్రక్రియ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు.పోలింగ్ కేంద్రం వద్ద సమస్యలు ఉన్నట్లయితే దృష్టికి తీసుకురావాలన్నారు. ఏదైనా శాంతి భద్రతల సమస్య తలెత్తితే వెంటనే అందుబాటులో వుండే సమీప అధికారులకు తెలియచేయాలన్నారు.పోలింగ్ కేంద్రం వద్ద గుమిగూడుట ఎటువంటి అవాంఛానీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా కృషి చేయాలన్నారు.
కరీంనగర్: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ
- Advertisment -