కరీంనగర్ క్రైమ్, జనతా న్యూస్: కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గల కొత్తపల్లి మండల పోలీస్ స్టేషన్ ను కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఆకస్మిక తనిఖీచేశారు. పోలీస్ స్టేషన్ లోని పలు రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో గల సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల వివరాలు తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు.
గతంలో ఎన్నికల సమయంలో గొడవలు చేసిన లేదా అల్లర్లను సృష్టించి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి, ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తులపై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని వారిని సంబంధిత అధికారుల ఎదుట బైండోవర్ చేయాలనీ, ఉల్లంఘీస్తే బౌండ్ డౌన్ చేసి పూచికత్తు సొమ్ము లక్ష రూపాయలు చెల్లించాల్సి వస్తుందని లేనియెడల జైలు శిక్షకూడా విధించబడుతు దని వారికి తెలపలన్నారు. దానితో పాటు వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున విధుల్లో అప్రమత్తంగా ఉండాలని,అలసత్వం ప్రదర్శిస్తే శాఖపరమైన చర్యలు తప్పవన్నారు. క్షేత్ర స్థాయిలో ఎన్నికల నియమావాళిని పక్కడ్బదీగా అమలు పరచాలన్నారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, ఎస్సై చంద్రశేఖర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.