కరీంనగర్`జనత న్యూస్
కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 11 మంది ఎస్‌ఐలు బదిలీ అయ్యారు. ఈ మేరకు శుక్రవారం సీపీ అభిషేక్ మహంతి ఉత్తర్వూలు జారీ చేశారు. టాస్క్ ఫోర్స్ లో పనిచేస్తున్న ఎస్ శ్రీధర్ ను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు, కమీషనరేట్ ఆఫీస్‌లో పనిచేస్తున్న జి.అనూష ను చొప్పదండి ఎస్సైగా, చొప్పదండి ఎస్సై గా పనిచేస్తున్న ఉపేంద్రాచారి ని కరీంనగర్ ట్రాఫిక్ విభాగానికి, కమీషనరేట్ ఆఫీస్ నందు పనిచేస్తున్న యూనస్ అహ్మద్ అలీ ని హుజురాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కు , కమీషనరేట్ ఆఫీస్ నందు పనిచేస్తున్న టి.వివేక్ ను జమ్మికుంట పోలీస్ స్టేషన్ కు , కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పి. అభిలాష్ ను కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. జమ్మికుంట పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్. రాజేష్ ను కరీంనగర్ వీఆర్‌కు, కమీషనరేట్ ఆఫీస్‌లో పనిచేస్తున్న ఎన్. శ్రీనివాస్ ను కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్‌కు , హుజురాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న జి. సాంబయ్య ను సీసీఎస్ పోలీస్ స్టేషన్ కు , కరీంనగర్ విఆర్ లో ఉన్న ఎస్. హనుమంతరావును పోలీస్ కంట్రోల్ రూమ్ కు బదిలీ చేశారు.
కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో .. 11 మంది ఎస్సైలు బదిలీ
- Advertisment -