‘పైలం పిలగా’ సినిమా
20న రిలీజ్‌కు సిద్దం
జనత న్యూస్ :
కరీంనగర్‌కు చెందిన హీరో, డైరెక్టర్, ప్రోడ్యూసర్ లచే రూపు దిద్దుకున్న సినిమా ఈ నెల 20న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు సిద్దమైంది. సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్‌లుగా ఆనంద్ గుర్రం , రామకృష్ణ వ్యవహరిస్తుండగా హీరో సాయి తేజ కల్వకోట నటిస్తున్నారు. కరీంనగర్ లోనే షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను ఇక్కడి ప్రేక్షకులు ఆదరిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నినియా యూనిట్ సభ్యులు. కరీంనగర్‌లో సినీ డైరెక్టర్ ఆనంద్ గుర్రం హీరో సాయి తేజ కల్వకోట , నటుడు ప్రణవ్ సోను , గీత రచయిత చంద్రమౌళి, నిర్మాత రామకృష్ణ సినిమా విశేషాలను వివరించారు. ఈ సినిమాలో ఇప్పటికే రిలీజ్ అయిన మూడు పాటలు ట్రేండిరగ్ లో నడుస్తున్నాయన్నారు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ కి, ట్రైలర్ కి మంచి స్పందన వచ్చిందని తెలిపారు.
హస్యభరిత చిత్రం..
హాస్యభరిత వ్యంగ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నారు. సినిమాలోసాయి తేజ కల్వకోట, పావని కరణం జంటగా నటించారు. చిత్రంలోని పాటలను, ట్రైలర్ లను ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల, హరీష్ శంకర్, వెంకటేష్ లు లాంచ్ చేసి, సినిమా యూనిట్ ను అభినందించారు. సినిమా టీజర్ ట్రైలర్ ను చూసిన హీరోనందమూరి బాలకృష్ణ తెలంగాణ యాసలోని డైలాగ్స్ కి ఫిదా అయ్యి సినిమా యూనిట్ సభ్యులందరికీ అభినందనలు తెలిపారని నిర్వాహకులు తెలిపారు. వందకు పైగా యాడ్స్ ఫిలిమ్స్‌కు దర్శకత్వం వహించిన ఆనంద్ గుర్రం దర్శకత్వం వహించడం సినిమా హిట్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సినీ అభిమానులు.