Karimnagar :కరీంనగర్, జనతా న్యూస్: జిల్లాకు మొదటి పౌరుడు కలెక్టర్ ఇంట్లోనే చోరీ జరిగింది. ఓ దుండగుడు ఆయన నివాసంలో చొరబడి ల్యాప్ టాప్ తో పాటు కొన్ని ముఖ్యమైన పత్రాలను దొంగిలించాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో కలకలం రేపింది. అసెంబ్లీ ఎన్నికల వేళ కరీంనగర్ కలెక్టర్ గోపీ బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన సామాను అంతా సర్దుకున్నాడు. అధికారులు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం హైదరాబాద్ లో రిపోర్టు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో తెల్లారి హైదరాబాద్ వెళ్లేందుకు బెడ్ పై పడుకున్నాడు. దీంతో గది వెనుకవైపు నుంచి వచ్చిన ఓ వ్యక్తి కలెక్టర్ ఇంట్లోని ల్యాప్ టాప్ తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఉన్న బ్యాగు, మరికొన్ని వస్తువులను దొంగిలించాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అయితే 24 గంటల పాటు సెక్యూరిటీ ఉండాల్సిన కలెక్టర్ కార్యాలయంలోనే ఇలా చోరీ జరగడం చర్చనీయాంశంగామారింది.
Karimnagar : కలెక్టర్ ఇంట్లో చోరీ.. ముఖ్యమైన పత్రాలు మాయం..
- Advertisment -