Saturday, March 14, 2026

కరీంనగర్: అక్షరాస్యత వారోత్సవాలకు దరఖాస్తులు ఆహ్వానం

కరీంనగర్, జనత న్యూస్

కరీంనగర్ జిల్లా స్థాయి ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల పోటీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. వ్యాసరచన , నినాదాలు, పోస్టర్ విభాగాల్లో పోటీలు ఉంటాయని అన్నారు. వ్యాసరచన పోటీలో భాగంగా “నేను రాత్రిపూట మిలియనీర్‌గా మారినట్లయితే, నేను ఆ డబ్బును ఎలా ఉపయోగించగలను?” అనే అంశం ఉంటుందన్నారు. ఇందులో పద పరిమితి: 300 పదాలు ఉండి ఇంగ్లీష్, తెలుగు హిందీ భాషల్లో రాయగలగాలని తెలిపారు. అలాగే ఉపన్యాస పోటీల్లో సమ్మేళనం యొక్క పొదుపు మరియు శక్తి అనే అంశంపై ఉంటుందన్నారు. చిత్రలేఖనం పోటీ ల్లో డిజిటల్ మరియు సైబర్ పరిశుభ్రత గురించి ఉంటుందన్నారు. దీనిని చేతితో వేయాలన్నారు. పోటీల్లో పాల్గొనేవారు పాఠశాల/కళాశాల పేరు, వయస్సు, కాంటాక్ట్ నంబర్ ఇవ్వాలని అన్నారు. పోటీలో పాల్గొనేవారు 22.02.2024 సాయంత్రం 5.00 గంటలలోపు knrleadbank@gmail.comకు ఇమెయిల్ ద్వారా వ్యాసం, ఉపన్యానం, చిత్రలేఖనం విభాగాల పేరిట పంపాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు తెలిపారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page