Karimnagar : కరీంనగర్, జనత న్యూస్: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో బీఆర్ఎస్ కు చెందిన మరో ముఖ్య నేత పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. గత కొన్ని నెలలుగా భూ కబ్జాకు పాల్పడిన బీఆర్ఎస్ నేతలను ఒక్కొక్కరు విచారణకు వచ్చి అరెస్టయ్యారు. కొందరు రిమాండ్ పై జైలు జీవితం గడుపుతున్నారు. ఇప్పటి వరకు కార్పొరేషన్ పరిధిలోని కొంతమంది కార్పొరేటర్లు, కార్పొరేటర్ల భర్తలు ఉన్నారు. తాజాగా మాజీ మంత్రికి దగ్గరగా ఉన్న ఓ నేతను పోలీసులు మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. కొంత మంది ఆరోపణలపై విచారిస్తున్న ఆయనను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే పోలీసులు ఈ విషయాన్ని ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. కానీ మీడియా సంస్థలో ఈ విషయం గుప్పుమనడంతో తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. ఈనేపథ్యంలో మరికొందరు భూ కబ్జాలకు పాల్పడిన వారిలో ఆందోళన మొదలైంది.
Karimnagar : భూ కబ్జా ఆరోపణలు.. పోలీసుల అదుపులో బీఆర్ఎస్ కీలక నేత
- Advertisment -