జనతా న్యూస్ బెజ్జంకి : తెలంగాణ సంప్రదాయంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా రాష్ట్ర ప్రజలు వారి వారి మొక్కులు తీర్చుకోవడంలో భాగంగా నిలువెత్తు బంగారం( బెల్లం) అమ్మవార్లకు సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ కానీ బెజ్జంకి మండలం వీరాపూర్ గ్రామానికి చెందిన రేవోజు రమణాచారి అనే యువకుడు వినూత్నంగా తన కారు ( వాహనం) ఎత్తు బంగారాన్ని అమ్మ వాళ్లకు సమర్పించి తన మొక్కులు చెల్లించుకున్నాడు. తనకు ఉపాధినిచ్చే తన కారే తన జీవనాధారం అని అది బాగుంటేనే తన జీవన నావ ముందుకెళ్తుందని అమ్మవార్ల ఆశీర్వాదంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా తన కుటుంబం సుఖ సంతోషాలతో ఉందని అందుకే తనకు ఉపాధినిచ్చే వాహన ఎత్తు బంగారాన్ని సమ్మక్క సారక్క అమ్మ వాళ్లకు సమర్పించానని జనతా న్యూస్ కి తెలిపారు.
కారెత్తు బంగారం ( బెల్లం) సమర్పించిన యువకుడు
- Advertisment -