కరీంనగర్-జనత న్యూస్
నగరంలోని జిల్లా వజ్రమ్మ కళ్యాణ మండపంలో మారుతి నగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో అర్చకులు చెరుకు సంతోష్ శర్మ సమక్షంలో మంగళ గౌరీ వ్రతాలు కన్నుల పండువగా జరిగాయి. ఇందులో 300 మంది సుహాసినులు పాల్గొన్నారు. పూజా అనంతరం లక్కీ డ్రా తీసి అన్న వితరణ చేశారు. అన్నదానంలో 600 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యుదయ సంఘం అధ్యక్షులు యాంసాని అశోక్ మాట్లాడుతూ..శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహిస్తున్నామని..రానున్న రోజుల్లోనూ ఆధ్మాత్మిక వేడుకలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఎలుగూరి మధు, కోశాధికారి మోటూరి ఆంజనేయులు, అదనపు ప్రధాన కార్యదర్శి నార్ల నవీన్, సంయుక్త కార్యదర్శి రేణికుంట ప్రవీణ్, ఉపాధ్యక్షులు వెలిచాలా చంద్రమోహన్, బండ కేదారినాద్ పాల్గొనగా.. చందా లక్ష్మీనారాయణ, రాచమల్ల భద్రయ్య ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.