మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ‘కన్నప్ప’ మూవీ టీం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేసింది. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్ లో రూ.100 కోట్లతో తీస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. షూటింగ్ కూడా దాదాపు కంప్లీట్ కావడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మక కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో కన్నప్ప టీం కనిపించింది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా హరిజన్ అమెరికన్ సాగా స్క్రీనింగ్ లో పాల్గొన్నారు. ఇందులో మహావిష్ణు శివ భక్తుడిగా కనిపిస్తారు. అలాగే ఇందులో అక్షయ్ కుమార్, మలయాళం స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, తమిళ స్టార్ నయనతార, లేటెస్ట్ గా కాజల్ కూడా ఇందులో నటిస్తున్నట్లు సమాచారం.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివెల్ లో ‘కన్నప్ప’ టీం సందడి
- Advertisment -