,జనతా న్యూస్:జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు కంకణాల అనిల్ కుమార్ ను కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఈ గురువారం కార్యాలయంలో నియామక పత్రాన్ని అనిల్ కుమార్ కు ఆందజేశారు. అనిల్ కుమార్ గారి నియామకం పట్ల పలువురు ఆర్యవైశ్య సంఘ సభ్యులు పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది.తనకు అప్పగించిన బాధ్యత పట్ల సంపూర్ణ న్యాయం చేస్తూ పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తానని అనిల్ కుమార్ గారు పేర్కొన్నారు.
తనకు ఈ పదవి రావడానికి సహకరించిన మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారికి, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి గారికి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మడుపు మోహన్ గారికి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వైద్యుల అంజన్ కుమార్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు శ్రావణ్ నాయక్ తదితరులకు కంకణాల అనిల్ కుమార్ గారు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది