హైదరాబాద్, జనత న్యూస్: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా కె. శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో శ్రీనివాసరెడ్డి రెండేళ్లు పదవిలో ఉంటారు. విశాలాంద్ర దినపత్రికకు సంపాదకుడిగా పనిచేసని ఆయన ప్రస్తుతం ప్రజాపక్షం పత్రికకు సంపాదకుడిగా ఉన్నారు. కాగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత అల్లం నారాయణను మీడియా అకాడమీ చైర్మన్ గా నియమించారు. ప్రస్తుతం కె. శ్రీనివాసరెడ్డికి అవకాశం ఇచ్చారు.
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా కె. శ్రీనివాస్ రెడ్డి
- Advertisment -