కోరుట్ల,ఫిబ్రవరి 04( జనతా న్యూస్):కోరుట్ల పట్టణం లో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురి అవుతుంటే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ సిబ్బంది ని తమ ఇంట్లో పని చేయించు కుంటున్నారని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు ఈరోజు కోరుట్ల పట్టణం లోని రెండవ వార్డ్ లో పర్యటించి సమస్య లు తెలుసుకో న్నారు ఈ సందర్బంగా కృష్ణారావు మాట్లాడుతూ సిబ్బంది కి ప్రభుత్వ ఖాజన నుండి చెల్లించిన డబ్బులు వెంటనే రికవరీ చేయాలని కమిషనర్ ను డిమాండ్ చేశారు ఇక నుండి ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు ఈ కార్యక్రమం లో జువ్వాడి కృష్ణారావు వెంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ ఉపాధ్యక్షులు యం ఏ నయీమ్, వాసీత్,నజీమోద్దీన్ చిట్మెల్లి రంజిత్ అప్సర్ ఇర్షాద్ హమీద్ తదితరులు పాల్గొన్నారు.
అధికారులను నీలదీసిన జువ్వాడి కృష్ణారావు రావు
- Advertisment -