బెజ్జంకి టౌన్, జనత న్యూస్:ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసి, మాజీ ప్రధాని పీ వీ నర్సింహా రావు కు భారత రత్న పురస్కారం ప్రకటించటం పట్ల మానకొండూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శానగొండ శ్రావణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.ఆయన బెజ్జంకి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా ఆవరణలో స్వీట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి ,వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కర వేణి పోచయ్య, కిసాన్ సెల్ అధ్యక్షుడు రొడ్డ మల్లేశం, శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు మంకాలి ప్రవీణ్, మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య,కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాజేందర్,మానాల రవి,డీవీ రావు,శీలం నర్సయ్య,మధుసూదన్ రెడ్డి,తిప్పారపు సురేష్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి,కోటి,అడుకని నర్సింగమ్,ప్రశాంత్,రాజేందర్,మహేందర్,దోనే శ్యామ్,రంజిత్, తదితరులు పాల్గొన్నారు.
పీవీకి భారతరత్న అవార్డుపై హర్షం
- Advertisment -