Jp Nadda: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇరుపక్షాల రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు బిజెపి సోషల్ మీడియా ఇన్చార్జ్ అమిత్, బిజెపి కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు బివై విజయేంద్ర, బిజెపి రాష్ట్ర సోషల్ మీడియా ఇన్ఛార్జి పై కర్టాటక కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. బీజేపీ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ చైర్మన్ ఆఫ్ ఇండియా ఎన్నికల కమిషషన్ కు చేసిన ఫిర్యాదులో బీజేపీ కర్ణాటక తమ సోషల్ మీడియా ప్లాట్ఫాంలో పోస్ట్ చేసిన వీడియో గురించి చెప్పారు. ఈ వీడియోలో రాహుల్ గాంధీ, సిద్ధ రామయ్యలను అనుచితంగా చూపించారని పేర్కొన్నారు.
Jp Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడిపై ఫిర్యాదు
- Advertisment -